ఉద్యోగాల భర్తీలో కేసీఆర్‌ విఫలం

ABN , First Publish Date - 2021-12-31T06:19:07+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీలో కేసీఆర్‌ విఫలం
టేకులసోమారంలో ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

వలిగొండ, భువనగిరి టౌన్‌, డిసెంబరు 30: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని టేకులసోమారం గ్రామంలో చేగూరి భాగ్యవతి మల్లేశం సొంత నిధులతో నిర్మించిన బీఆర్‌ అంబేడ్కర్‌ కమ్యూనిటీ భవనం, పీర్ల కొట్టాన్ని ఎంపీ కోమటిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఐదు సార్లు డీఎస్సీ నిర్వహించి, 75 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. రైతులు వరి సాగు చేస్తే ఉరే దిక్కనడం సరైన విధానం కాదని, రూ.లక్షల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించింది ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం దగ్గరపడిందన్నారు. కేసీఆర్‌ పాలనలో దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయలేదని, ఇళ్ళ నిర్మాణం చేపట్టలేదన్నారు. యువకుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే లబ్ధి పొందిందని, సామాన్య ప్రజల బతుకులు మారలేదన్నారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న దాత చేగూరి మల్లేశాన్ని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.  ఈ సందర్భంగా యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు జిట్ట బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, సర్పంచ్‌ చేగూరి భిక్షపతి, జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్‌ ఎంపీపీ బాత ఉమాదేవి, నాయకులు కసుల శ్రీనివాసరావు, పడమటి జగన్మోహన్‌రెడ్డి, రామాంజనేయులు, జహంగీర్‌, శ్యాంగౌడ్‌, ప్రభాకర్‌, యుగేందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సతీష్‌, సత్తిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా భువనగిరిలో నిర్మాణ  దశలో ఉన్న అంబేడ్కర్‌ భవనాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. 2017లో భువనగిరికి  మంజూరైన అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ భవన నిర్మాణ పనులు ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాకపోవడం విచారకరమన్నారు. ఆయనవెంట నాగారం అంజయ్య, బర్రె సుదర్శన్‌, బర్రె జహంగీర్‌, ఈరపాక నర్సింహ, ఇటుకల దేవేందర్‌, కంచనపల్లి నర్సింగరావు ఉన్నారు.  

Updated Date - 2021-12-31T06:19:07+05:30 IST