కమ్ముకున్న మబ్బులు.. రైతు గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2021-11-02T06:02:11+05:30 IST

లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. ఆరుగా

కమ్ముకున్న మబ్బులు.. రైతు గుండెల్లో గుబులు

వర్షం వస్తే ధాన్యం, పత్తి తడుస్తుందని ఆందోళన

కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం రాశులు

2.76లక్షల ఎకరాల్లో వరి, 1.22 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

 రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివర్లో అకాల వర్షానికి దెబ్బతింటే పరిస్థితి ఏమిటని ఆందోళన మొదలైంది. జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయి. పత్తి తీత కూడా కొనసాగుతోంది. సోమవారం కమ్ముకొచ్చిన కారు మబ్బులను చూసిన రైతన్న గుండె చెదురుతోం ది. వర్షం వస్తే చేతికి వచ్చిన వరి, పత్తి తడిసి తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. వానాకాలంలో రైతులు 2,76,659ఎకరాల్లో వరి, 1,22,864 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.

- మోత్కూరు

ప్రస్తుతం జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.మార్కెట్లో వ్యాపారులు ధాన్యానికిక్వింటాకు రూ.140 0నుంచి రూ.1500 మాత్రమే ధర ఇస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1960 ఉంది. తక్కువ ధరకు విక్రయించి  రైతులు నష్టపోతున్నారు. మొదట్లో ధాన్యం కొనుగోలు చేసే ది లేదని ప్రకటించిన ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేస్తా మని ప్రకటించింది. దసరా పండుగ తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా నేటికీ ప్రారంభించలేదు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోటే రైతులు ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదుదు చూస్తున్నా రు. అక్కడే ధాన్యం ఆరబెడుతున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఇటీవల రైస్‌మిల్లర్లు, కేంద్రాల నిర్వహకులు, వ్యవసాయ, మార్కెట్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తమ మిల్లుల సామర్థ్యం లక్షా 20వేల టన్నులే ఉందని,రబీలో తీ సుకున్న ధాన్యమే గోదాముల్లో ఇంకా నిల్వ ఉందని చెప్పా రు.అంతకు మించి ధాన్యాన్ని దిగుమతి చేసుకోలేమని రైస్‌ మిల్లర్లు అధికారులకు వివరించారు. ఇక్కడ మిల్లుల వద్ద దిగుమతి చేయగా మిగితా ధాన్యాన్ని ఇతర జిల్లాల్లోని మి ల్లులకు పంపాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం ట్రాన్స్‌పోర్ట్‌ చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవగా ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన లేదని తెలుస్తోంది. 

రైతులే పట్టాలు తెచ్చి కప్పుతున్నారు

మార్కెట్లలో పోసిన ధాన్యం రాశులపై కప్పడానికి అధికారులు టార్పాలిన్లు ఇస్తున్నారు. ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు వారే పట్టాలు అద్దెకు తెచ్చి రాశులపై కప్పుకుంటున్నారు.

ముమ్మరంగా వరి కోతలు, పత్తి తీత

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరు గుతోంది. సోమవారం మబ్బులు కమ్ముక రావడంతో ఎం డబెట్టిన ధాన్యాన్ని రైతులు రాశులుగా చేసి టార్పాలిన్లు, పట్టాలు కప్పారు. ఎండ ఎండరాగానే రైతుల ధాన్యాన్ని ఆరబోస్తూ, మబ్బు రాగానే రాశి చేసి కప్పి పెట్టడానికి నానా యాతన పడుతున్నారు. ఇప్పుడు వర్షం కురిస్తే పొ లం మీద కోయకుండా ఉన్న అయిన వరి కంకులు తడిసి నేలకొరుగుతుందని, దాంతో కంకిమీదనే గింజలు మొలకొస్తాయని, మిషన్‌తో కోయడం కూడా కష్టమై నష్టపోతామంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధా న్యం తడిసి ముద్దవుతుందని ఆందోళన చెందుతున్నారు. కూలీలు దొరక్క పత్తి తీత మందకొడిగా సాగుతోంది. చేలల్లో పత్తి కాయలు పగిలి ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి వర్షం కురిస్తే తడిసి నాణ్యత దెబ్బతింటుందని, ధర రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అధికం గా కురిసిన వర్షాలకు పత్తి చేలు దెబ్బతిని, ఎకరాకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఐదారు క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధరకన్నా క్వింటాకు రూ. 2వేలు ఎక్కువ ధర పలుకుతుండటంతో లాభం రాకపోయినా నష్టం మాత్రం రాదన్న ధీమాతో రైతులు ఉన్నారు. వర్షం కురిస్తే పత్తి తడిసి ధర రాక నష్టపోతామంటున్నారు. వరికోతలు, పత్తి తీత పనులు ముగిసే వరకు వర్షం కురియకుండా కరుణించాలని రైతులు వరుణదేవున్ని వేడుకుంటున్నారు.

వర్షం వస్తే ధాన్యం తడిసి మొలకెత్తుతుంది

రెండు ఎకరాల వరి కోసి ధాన్యం మా ర్కెట్లో పోసి ఆరబెట్టా. రాశిపై టార్పాలి న్లు కప్పినప్పటికీ వర్షం కురిస్తే రాశి అడుగు నుంచి నీరు వెళ్లి అడుగు ధా న్యం మొలకొస్తోంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనాలి.

- పన్నాల శ్రీనివా్‌సరెడ్డి, రైతు మోత్కూరు

Updated Date - 2021-11-02T06:02:11+05:30 IST