కమనీయం సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2021-12-10T05:27:12+05:30 IST
జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణేశ్వరస్వామి దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవం గురువారం కన్నుల పండువగా నిర్వహించారు.

సూర్యాపేట కల్చరల్ / కోదాడ రూరల్, డిసెంబరు 9 : జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణేశ్వరస్వామి దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవం గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రేంటాల సతీ్‌షశర్మ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాల పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పగిళ్ళ సునీల గన్నారెడ్డి, ఎంవీడి ప్రసాద్‌రావు, ధర్మకర్తలు అనంతుల సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, వాసుదేవరావు, తోట శ్యాం పాల్గొన్నారు. కోదాడ మండలం తమ్మరలో సమీపంలో సుబ్రహ్మణ్యస్వామి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ స్లాబ్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బొల్లు చైతన్య, సాయి, ధనాల వెంగయ్య, మల్లెల బ్రహ్మయ్య, బాబురావు, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, మాజీ జడ్పీటీసీ గ రణి కోటేశ్వరరావు, అంబడి కర్ర శ్రీనివాసరావు, బసవయ్య, సైదయ్య పాల్గొన్నారు.