పేటలో కబడ్డీ సంబురం

ABN , First Publish Date - 2021-03-22T06:25:52+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి జూనియర్‌ బాల, బాలికల కబడ్డీ పోటీలు సోమవారం ప్రారంభంకానున్నాయి. గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్‌, రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ వరకు జిల్లా పోలీస్‌ కార్యాలయ మైదానంలో పోటీలు జరగనున్నాయి.

పేటలో కబడ్డీ సంబురం

రేపటి నుంచి 25 వరకు జాతీయస్థాయి పోటీలు

పోటీల్లో పాల్గొననున్న 28 రాష్ట్రాల క్రీడాకారులు


సూర్యాపేట(కలెక్టరేట్‌)మార్చి 21: సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి జూనియర్‌ బాల, బాలికల కబడ్డీ పోటీలు సోమవారం ప్రారంభంకానున్నాయి. గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్‌, రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ వరకు జిల్లా పోలీస్‌ కార్యాలయ మైదానంలో పోటీలు జరగనున్నాయి. అందుకు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. ఈ పోటీల్లో 28 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటుండగా, ఇప్పటికే పలువురు జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకున్నారు. పోటీల్లో 28 బాలుర జట్లు, 28 బాలికల జూనియర్‌ జట్ల క్రీడాకారులు, వారి సహాయకులు, కోచ్‌లు, సిబ్బంది 1500 మందికిపైగా రానున్నారు. కరోనా కారణంగా మహారాష్ట్ర క్రీడాకారులు, ఇతర కారణాల తో అసోం రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన డం లేదు. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో ప్రతి రోజు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సింఽథటిక్‌ మ్యాట్లపై పోటీలు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్‌ 40 నిమిషాలపాటు జరగనుండగా, మ్యాచ్‌ మధ్య లో 20 నిమిషాల విరామం ఇవ్వనున్నారు. రోజు 36 మ్యాచ్‌లు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరగుతాయి. టోర్నీ మొత్తం 144మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీలు కావడంతో సుమారు 15వేల మందికిపైగా ప్రేక్షకులు ఒకేసారి వీక్షించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని భోజన, వసతి ఏర్పాట్లు కూడా చేశారు. క్రీడాకారులు బస చేసే ప్రాంతంలో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ పర్యవేక్షణలో సుమారు 400 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. క్రీడలను వీక్షించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్‌, పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


దేశం గర్వించేలా పోటీలు : మంత్రి జగదీ్‌షరెడ్డి 

దేశం గర్వించేలా సూర్యాపేటలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నాం. చరిత్రలో నిలిచేలా భారీ ఏర్పాట్లు చేశాం. 15వేల మంది ప్రేక్షకులు వీక్షించేలా సీటింగ్‌ కెపాసిటీ ఏర్పాట్లు చే శాం. ఏ ఒక్క క్రీడాకారుడికి అసౌకర్యం కలగకుండా చూస్తాం. క్రీడాకారులు ప్రతిభచాటి జాతీయ జట్టుకు ఎంపిక కావాలి.

Updated Date - 2021-03-22T06:25:52+05:30 IST