ఫెయిల్‌ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-19T05:40:35+05:30 IST

తరగతులు నిర్వహించకుండా ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు చెలగాటమాడుతుందని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ఉప్పుల శాంతికుమార్‌ అన్నారు.

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎ్‌సఎఫ్‌ ధర్నా

భువనగిరిరూరల్‌, డిసెంబరు 18: తరగతులు నిర్వహించకుండా ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు చెలగాటమాడుతుందని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ఉప్పుల శాంతికుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఫెయిల్‌ అయిన ఇంటర్‌ విద్యార్థులకు న్యా యంచేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఆనలైన క్లా సుల పేరుతో పాఠాలు సరిగా చెప్పకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ మొదటి సం వత్సరం పరీక్షలో 49శాతం మంది మాత్రమే పాస్‌ అయ్యారని, దీని కి ఇంటర్‌ బోర్డు అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సూరారం జాని, అభిలాష్‌, సా యి చరణ్‌, కృష్ణ, కల్యాణ్‌, మనోహర్‌, నవీన, వికాస్‌ పాల్గొన్నారు. 

చౌటుప్పల్‌టౌన: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలలో తక్కువ శాతం ఉత్తీర్ణతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎనఎ్‌సయూఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు అధైర్యపడవద్దని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాచకొండ భార్గవ్‌, అంతటి వెంకటేశ, గౌతమ్‌, సాయిసుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T05:40:35+05:30 IST