నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
ABN , First Publish Date - 2021-12-31T16:00:50+05:30 IST
నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు డిమాండ్ చేశారు.

సూర్యాపేట కల్చరల్, డిసెంబరు 30: నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతి నియమిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుందని ఆరో పించారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమిస్తూ నిరుద్యోగులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు బోనగిరి గిరిబాబు, వీరబోయిన రమేష్, కామళ్ళ శ్రీను, ధరావత్ రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.