ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-12-15T05:44:43+05:30 IST

ఖాళీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ పేరబోయిన మహేం దర్‌ డిమాండ్‌ చేశారు. మోత్కూరులో మంగళవారం జరిగిన సంఘం మండల మహాసభలో మాట్లాడారు. పెట్టుబడి దారులకు వంత పాడుతు

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మహేందర్‌

మోత్కూరు, డిసెంబరు 14: ఖాళీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ పేరబోయిన మహేం దర్‌ డిమాండ్‌ చేశారు. మోత్కూరులో మంగళవారం జరిగిన సంఘం మండల మహాసభలో మాట్లాడారు. పెట్టుబడి దారులకు వంత పాడుతున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు అమలుకు నోచని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని, ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయక, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం యువతను మోసగిస్తుందన్నారు. అనంతరం సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మొగుళ్ల శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పస్తం భాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా నారమల్ల ప్రదీప్‌, సహాయ కార్యదర్శిగా తొంట కృష్ణ, కోశాధికారిగా చిప్పలపల్లి ప్రశాంత్‌ ఎన్నిక య్యారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కోకన్వీనర్లు ఎల్లంకి మహేష్‌, ఎండి. నయీం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, వెంకట్‌, పుల్కరం మల్లేష్‌, బి.నర్సింహ, జె.రాములు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-15T05:44:43+05:30 IST