మొఘల్‌ పాలకుల కాలం నాటి ఆభరణాలు లభ్యం

ABN , First Publish Date - 2021-12-30T06:32:31+05:30 IST

మండలంలోని కుంకుడుపాములలో మొఘల్‌ పాలకుల నాటి ఆభరణాలు, మొహరాలు లభ్యమయ్యాయి.

మొఘల్‌ పాలకుల కాలం నాటి ఆభరణాలు లభ్యం
కుంకుడుపాముల గ్రామంలో లభ్యమైన బంగారు ఆభరణాలు, వెండి నాణేలు

రామన్నపేట, డిసెంబరు 29: మండలంలోని కుంకుడుపాములలో మొఘల్‌ పాలకుల నాటి ఆభరణాలు, మొహరాలు లభ్యమయ్యాయి. 15 రోజుల క్రితం అన్నదమ్ములకు గుప్తనిధులు లభ్యంకాగా, పంపకాల్లో తేడా రావటంతో విష యం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  కుంకుడుపాముల గ్రామంలో అన్నదమ్ములు కన్నెబోయిన మల్లయ్య, లింగయ్య వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా మట్టిపాత్ర(గురిగి) లభించించింది. అందులో బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. గుప్త నిధుల పంపకంలో అన్నదమ్ముల మధ్య తేడాలు రావడంతో విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం గ్రామాన్ని సందర్శించి అన్నదమ్ముల నుంచి నిధులు స్వాధీనం  చేసుకున్నారు. 19బంగారు ఆభరణాలు, 38వెండి నాణేలు, ఐదు బంగారు, ఐదు వెండి గుండ్లు, 14చెవి రింగులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన ఆరో రాజు ఔరంగజేబు పరిపాలనలో ( 1658-1707) నాటి బంగారు ఆభరణాలు, వెండి మొహరాలుగా పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.


Updated Date - 2021-12-30T06:32:31+05:30 IST