మంచం పట్టిన జంకుతండా

ABN , First Publish Date - 2021-08-10T06:54:17+05:30 IST

మండలంలోని జంకుతండా మంచం పట్టింది. గ్రామస్థులు వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు.

మంచం పట్టిన జంకుతండా
కరోనా పరీక్ష చేస్తున్న వైద్య సిబ్బంది

ఆరుగురికి టైఫాయిడ్‌, నలుగురికి డెంగీ 

మిర్యాలగూడ రూరల్‌, ఆగస్టు 9: మండలంలోని జంకుతండా మంచం పట్టింది. గ్రామస్థులు వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. కరోనా ఆందోళన చెందుతున్నా వైద్యసిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నెల 6న చిన్నారి డెంగీతో మృతిచెందింది. వెంటనే స్పందించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది రెండు రోజుల తర్వాత నింపాదిగా తండా వైపు కదిలారు. హడావ ుడిగా సోమవారం తండాలో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. అందులో 42మందిని గుర్తించి 22మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్‌ వచ్చింది. ఆరుగురు టైఫాయిడ్‌, నలుగురు డెంగీతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య లోపంతోనే జ్వరాల బారిన పడుతున్నారన్నారు. 

Updated Date - 2021-08-10T06:54:17+05:30 IST