యువకుడిని కొట్టిన తల్లీకుమారుడికి జైలు

ABN , First Publish Date - 2021-12-31T16:37:56+05:30 IST

యువకుడిని కొట్టిన కేసులో తల్లీ కొడుకులకు జైలుశిక్ష విధిస్తూ నిడమనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు గురువారం తీర్పు వెల్లడించారు.

యువకుడిని కొట్టిన తల్లీకుమారుడికి జైలు

నిడమనూరు, డిసెంబరు 30: యువకుడిని కొట్టిన కేసులో తల్లీ కొడుకులకు జైలుశిక్ష విధిస్తూ నిడమనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి పురుషోత్తమరావు గురువారం తీర్పు వెల్లడించారు. కోర్టు లైసన్‌ అధికారి షేక్‌ అహ్మద్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం... అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన వల్లపు లింగమ్మ తమ కుమార్తెను తీసుకెళ్లాడనే అనుమానంతో అదే గ్రామానికి చెం దిన చిట్యాల మహేష్‌ అనే యువకుడిపై తన కుమారుడు వల్లపు యాదగిరితో కలిసి 2016 మార్చి 2న దాడి చేసింది. దీంతో బాధితుడు మహేష్‌ తల్లి చిట్యాల సైదమ్మ హాలియా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ సురే్‌షకుమార్‌ నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. గురువారం కేసు విచారించిన న్యాయమూర్తి పురుషోత్తమరావు నేరం రుజువు కావడంతో నిందితులకు నెల రోజుల జైలు లేదా రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

Updated Date - 2021-12-31T16:37:56+05:30 IST