జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణం

ABN , First Publish Date - 2021-12-31T06:17:53+05:30 IST

జాతీయస్థాయిలో పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణం
క్రీడాకారులను సన్మానిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ పమేలాసత్పథి 

క్రీడాకారులకు సన్మానం 

భువనగిరి రూరల్‌, భువనగిరి టౌన్‌, డిసెంబరు 30: జాతీయస్థాయిలో పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీవరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌లో జరిగిన అండర్‌-24 విభాగంలో ఏక్‌భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ పేరుతో నిర్వహించిన షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొని జిల్లాకు నాలుగు పతకాలను సాధించిన క్రీడాకారులను ఆమె సన్మానించి మెమోంటోలు అందజేశారు. అడ్డగూడూరు మండలం జానకిపురానికి చెందిన బోనాల ఇందు, భువనగిరి పట్టణానికి చెందిన బందనాదం వంశీ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారుపతకాలు సాధించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మొదటి సౌత్‌జోన్‌ షూటింగ్‌ బాల్‌పోటీల్లో అండర్‌-19 విభాగంలో వలిగొండ మండలానికి చెందిన దేశపాక మనోజ్‌, అడ్డగూడూరు మండలం కోటమర్తికి చెందిన బెల్లె సిద్ధులు ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. వీరిని కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె.ధనుంజయ్‌, జిల్లా షూటింగ్‌ బాల్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు నర్రం చంద్రశేఖర్‌, స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోత్కూరు యాదయ్య, జనరల్‌ సెక్రటరీ మానస, కృష్ణ, ఎస్‌ సైదులు, మురళీ తదితరులున్నారు.


స్వచ్ఛ సర్వేక్షణ్‌ అంబాసిడర్‌గా అన్విత

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 భువనగిరి మునిసిపాలిటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పర్వతారోహకురాలు పడమటి అన్విత నియమితులయ్యారు. ఈమేరకు కలెక్టర్‌ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ గురువారం నియామకపత్రాన్ని అందజేశారు.  

Updated Date - 2021-12-31T06:17:53+05:30 IST