యాదగిరిగుట్టలో ఐటీ దాడులు

ABN , First Publish Date - 2021-03-24T06:58:07+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఆదాయపు పన్నుల శా ఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిం చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బీర్ల అయిలయ్య నివాసంలో ఉదయం ఆరు గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

యాదగిరిగుట్టలో ఐటీ దాడులు
సోదాలు జరుగుతున్న అయిలయ్య నివాసగృహం

కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఇంట్లో సోదాలు


యాదాద్రి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఆదాయపు పన్నుల శా ఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిం చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బీర్ల అయిలయ్య నివాసంలో ఉదయం ఆరు గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. హైద రాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దాడుల నేప థ్యంలో ఆ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వ హిస్తున్న బీర్ల అయిలయ్య ఆదాయపు లెక్కల కోసం ఈదాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. యాదాద్రి ఆలయం అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గుట్ట పరిసరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే భూ క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. బీర్ల అయిలయ్య స్థానికంగా కొనుగోలు చేసిన భూములను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు లేఅవుట్‌ అభివృద్ధికి అప్ప గించడం వంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదాయ పన్నుల శాఖ అధికారులు అయిపయ్య ఇంటిపై దాడులు చేసి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటి బయట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-03-24T06:58:07+05:30 IST