సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: పల్లా
ABN , First Publish Date - 2021-01-12T06:16:55+05:30 IST
సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కోరారు.

సంస్థాన్ నారాయణపురం, జనవరి11: సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నారాయణపురం, చౌటుప్పల్ మండలాల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటై ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సీపీఐ రాష్ట్ర నాయకుడు కురుమిద్దె శ్రీనివాస్, మండల కార్యదర్శులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు దుబ్బాక భాస్కర్, సుర్వి నర్సింహ, కలకొండ సంజీవ, పగిళ్ల మోహన్‌రెడ్డి, కొండూరు వెంకటేష్, వీరమళ్ల యాదయ్య, పొట్ట శంకరయ్య, బద్దుల సుధాకర్, దాసరి అంజయ్య పాల్గొన్నారు.