శమీ పూజకు మంత్రి జగదీష్‌రెడ్డికి ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-14T05:48:04+05:30 IST

విజయదశమి సందర్భంగా జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే శమీ పూజకు హాజరుకావాలని ఆలయ కమి టీ సభ్యులు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు

శమీ పూజకు మంత్రి జగదీష్‌రెడ్డికి ఆహ్వానం
మంత్రిని కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 13: విజయదశమి సందర్భంగా జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే శమీ పూజకు హాజరుకావాలని ఆలయ కమి టీ సభ్యులు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని బుధవారం కలిశారు. ఈ నెల 15వ తేదీన దేవాలయంలో నిర్వహించే శమి పూజకు రావాలని కోరారు. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శమి పూజల్లో పాల్గొనాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో హరిచరణ్‌ ఆచార్యులు, బజ్జూరి క్రిష్ణయ్య, మిర్యాల రమేష్‌, మంజుల, అరుణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T05:48:04+05:30 IST