25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-19T06:06:47+05:30 IST

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబరు 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడా రు.

25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

జిల్లాలో 58 పరీక్ష కేంద్రాల ఏర్పాటు : అదనపు కలెక్టర్‌ 


నల్లగొండ క్రైం, అక్టోబరు 18: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబరు 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ  సమావేశంలో ఆయన మాట్లాడా రు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయన్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 58 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 119 జూనియర్‌ కళాశాలలకు చెందిన 16,854 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సమీపంలోని జీరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించా రు. పరీక్షల పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నాలుగు సిట్టింగ్‌ స్క్వా డ్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రం వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపుతో పాటు విద్యుత్‌ సమస్యలు లేకుండా చూ డాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షకు సకాలంలో వచ్చే లా బస్సులు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో తాగు నీటి సదుపాయం కల్పించాలన్నారు. అదేవిధంగా కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాల ట్రంక్‌ పెట్టెలను ఈనెల 21 నుంచి భద్రపరిచేలా అన్ని పోలీ్‌సస్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో డీఐఈవో దస్రూనాయక్‌, ప్రిన్సిపాళ్లు వి.భానునాయక్‌, నరేంద్రకుమార్‌, ఇస్మాయిల్‌, సింగం శ్రీనివాస్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:06:47+05:30 IST