మాజీ మంత్రి ఈటలకు మద్దతుగా దీక్షలు
ABN , First Publish Date - 2021-05-05T06:21:36+05:30 IST
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌కు మద్ద తుగా మంగళవారం భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో నిరసన దీక్ష చేశారు.

భువనగిరి టౌన్/ సంస్థాన్ నారాయణపురం/ వలిగొండ మే 4: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌కు మద్ద తుగా మంగళవారం భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో నిరసన దీక్ష చేశారు. అగ్రవర్ణ అహంకారంతోనే ఈటలకు రాజకీయంగా, ఆర్థికంగా సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. బడుగులంతా సీఎం వెంటే ఉన్నారని పేర్కొన్నారు. దీక్షలు చేసిన వారిలోసంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, లక్ష్మీనారాయణ, కాంత్రికుమార్, శాబన్‌కార్ వెంకటేష్, పురుషోత్తం, జంగాచారి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంస్థాన్‌నారాయణపురం మండల వ్యాప్తంగా నిరసన దీక్ష నిర్వహించారు. కొవిడ్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారుగా ఇళ్లలోనే దీక్షలు చేపట్టారు. కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఘనం నర్సింహ, యువజన సంఘం అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్, శివ, అరుణ్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినందుకు నిరసనగా బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి వలిగొండలోని తన గృహంలో ఒక రోజు మౌన దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.