మట్టపల్లి పవిత్రోత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-10-05T06:07:28+05:30 IST

మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయంలో మూడు రోజు ల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాల కు సోమవారం రాత్రి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పొడువునా స్వామి సన్నిధిలో నిర్వహించే అర్చనలు, ఇతర సేవల్లో దొర్లే దోష పరిహారం కోసం ఏటా ఈ పవిత్రో త్సవాలు నిర్వహిస్తారు. తమిళనాడులోని శ్రీస్వాతి నక్షత్ర మహాయజ్ఞ ట్రస్ట్‌ చైర్మ

మట్టపల్లి పవిత్రోత్సవాలకు శ్రీకారం
గురుడ వాహనసేవ నిర్వహిస్తున్న అర్చకులు

వైభవంగా గరుడవాహన సేవ

మఠంపల్లి, అక్టోబరు 4: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయంలో మూడు రోజు ల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాల కు సోమవారం రాత్రి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పొడువునా స్వామి సన్నిధిలో నిర్వహించే అర్చనలు, ఇతర సేవల్లో దొర్లే దోష పరిహారం కోసం ఏటా ఈ పవిత్రో త్సవాలు నిర్వహిస్తారు. తమిళనాడులోని శ్రీస్వాతి నక్షత్ర మహాయజ్ఞ ట్రస్ట్‌ చైర్మన్‌ ముక్కూర్‌ శ్రీనివాసన్‌ పంపిన పవిత్రాలను ఇక్కడి యాగ మండపం నుంచి ధర్మకర్త లు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమా ర్‌, ఈవో సిరికొండ నవీన్‌ తలపై ధరించి ఆలయానికి చేర్చారు. అనంతరం అఖండ దీపారాధన, ఆచార్య దిరుత్విగ్వరణం పవి త్రల ప్రతిష్ఠ శాస్రోక్తంగా నిర్వహించారు. వాస్తు హోమాలు, పంచగవ్యారాదనలు నిర్వహించి క్షీర గణాధివాస సంప్రోక్షణ చేపట్టారు. శయనాధివాసం, అగ్ని ప్రతిష్ఠాపన అనంతరం మహాశాంతి హోమం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అలంకరించిన గురుడ వాహనంపై స్వామివారిని ప్రతిష్ఠించి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అర్చనలు, చతుర్వేద పారాయణం తదితర కార్యక్రమాలను బుర్రా వాసుదేవాచార్యులు నేతృత్వంలో పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, బదరీనారా యణచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి నిర్వహించారు.

Updated Date - 2021-10-05T06:07:28+05:30 IST