ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-11-09T06:46:29+05:30 IST

ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు కమ్మంపాటి శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేయాలి
ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌

నల్లగొండ రూరల్‌, నవంబరు 8 :  ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు కమ్మంపాటి శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కలెకరేట్‌ గేటు ఎదుట పెండింగ్‌ స్కాలర్‌ షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌ మెంటు విడుదల చేయాలని, అక్రమ డిప్యూటేషన్ల పాల్పడిన డీఈవోను సస్పెండ్‌ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్ధులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యాలయం లోనికి ఎవ్వరూ వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా  శంకర్‌ మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజురీయింబర్స్‌ కోసం దాదాపు 15లక్ష మంది విద్యార్థులు ఎదురు చుస్తూన్నారని అన్నారు. విదార్థుల సమస్యలు పరిష్కరించక పోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు నరేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్ర శ్రీకాంత్‌, సుకుమార్‌, గోపీనాఽథ్‌, ధనలక్ష్మి, త్రీవేణి, దివ్య, అంకిత పాల్గొన్నారు. 

 మిర్యాలగూడ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యులు జగన్‌నాయక్‌ కోరారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట స ంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ అక్రమ డిప్యూటేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈవోపై విచారణ జరిపించాలని కోరారు. సమావేశంలో నవీన్‌, ప్రసాద్‌, సాయి పాల్గొన్నారు.


Updated Date - 2021-11-09T06:46:29+05:30 IST