తమసోమా జ్యోతిర్గమయ ట్రైలర్ చూస్తే.. వేదం సినిమా గుర్తుకొస్తోంది
ABN , First Publish Date - 2021-10-18T06:36:25+05:30 IST
భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రూపొందించి న ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే ‘వేదం’ సినిమా గుర్తుకొస్తుందని దర్శకు డు క్రిష్ జాగర్లమూడి అన్నారు.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి
భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 17: భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రూపొందించి న ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ చూస్తుంటే ‘వేదం’ సినిమా గుర్తుకొస్తుందని దర్శకు డు క్రిష్ జాగర్లమూడి అన్నారు. భూదాన్‌పోచంపల్లికి చెందిన తడ క రమేష్, విజయ్ బడుగు ఆధ్వ ర్యంలో రూపొందించిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ను ఆదివారం క్రిష్ వీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి మాటలతో, కంటికి ఇంపు కలిగించే గ్రామీణ దృశ్యాల తో చేతి వృత్తుల్లో ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహ కల్పించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు చిత్రీకరించారని కొనియాడారు. ఈనెల 29న విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు.