వందశాతం వ్యాక్సినేషన్‌కు కృషి : ఎంపీడీవో

ABN , First Publish Date - 2021-12-31T16:02:42+05:30 IST

మండల వ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీడీవో ఈదయ్య తెలిపారు.

వందశాతం వ్యాక్సినేషన్‌కు కృషి : ఎంపీడీవో

చిలుకూరు, డిసెంబరు 30: మండల వ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీడీవో ఈదయ్య తెలిపారు. మండలంలోని బేతవోలులో కరోనా వ్యాక్సినేషన్‌ను గురువారం పరిశీలించారు. రెండు డోసులు వేయించుకోని వారి కోసం సిబ్బంది ఇంటింటికీ తిరిగి టీకా వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ముక్కపాటి నర్సింహారావు, సర్పంచ్‌ చంద్రకళ నాగయ్య, కార్యదర్శి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:02:42+05:30 IST