అవయవదాత కుటుంబానికి ఇల్లు

ABN , First Publish Date - 2021-02-06T06:16:29+05:30 IST

మోత్కూరు మునిసిపాలిటీకి చెందిన అవయవదాత వరకాంతం నర్సిరెడ్డి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రిమేఘారెడ్డి హామీ ఇచ్చారు. నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆమె పరా మర్శించి మాట్లాడారు.

అవయవదాత కుటుంబానికి ఇల్లు
అవయవదాత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న దాత భాస్కర్‌రెడ్డి

మోత్కూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ హామీ 

నర్సిరెడ్డి కుటుంబానికి పలువురి సాయం


మోత్కూరు, ఫిబ్రవరి 5: మోత్కూరు మునిసిపాలిటీకి చెందిన అవయవదాత వరకాంతం నర్సిరెడ్డి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రిమేఘారెడ్డి హామీ ఇచ్చారు. నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆమె పరా మర్శించి మాట్లాడారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. భర్తను కోల్పోతున్న బాధను దిగమింగి ఎంతో ఔధార్యంతో తన భర్త అవయవదానానికి అంగీకరించిన నిర్మలను సావిత్రి అభినందించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు కృషి చేయాలని, దాతలు ముందుకు రావాలన్నారు.


నర్సిరెడ్డి కుటుంబం దీనస్థితిని మీడియా ద్వారా చూసి చలించిన హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన దాత పెసరు భాస్కర్‌రెడ్డి తన భార్య మంజుల జ్ఞాపకార్థం మోత్కూరు వచ్చి నర్సిరెడ్డి కుటుంబానికి రూ.50వేలు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే నర్సిరెడ్డి ఇద్దరి కుమారుల పేరున చెరో రూ.25 వేల చొప్పున బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, వ్యాధులతో అవయవాలు చెడిపోయి వాటి మార్పిడి అవసరమైన వారిసంఖ్య 10 శాతానికిపైగా ఉండగా, అవయవాలు దానం చేస్తామంటూ ముందుకొచ్చే వారి సంఖ్య 0.1 శాతం కూడా లేదన్నారు.


అదేవిధంగా నాగోల్‌కు చెందిన జీఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గుజ్జ ప్రవీణ్‌గౌడ్‌ శుక్రవారం అవయవ దాత నర్సిరెడ్డి కుటుంబానికి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మన్నె నర్సిరెడ్డి, మునిసిపల్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్లు బొల్లెపల్లి వెంకటయ్య, కొణతం యాకూబ్‌రెడ్డి, కౌన్సిలర్‌ బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తి, వివిధ పార్టీల నాయకులు సామ పద్మారెడ్డి, పైళ్ల సోమిరెడ్డి, పన్నాల శ్రీనివా్‌సరెడ్డి, గుండగోని రామచంద్రు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T06:16:29+05:30 IST