ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ
ABN , First Publish Date - 2021-08-25T06:15:43+05:30 IST
మండలంలోని మట్టపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రామిశెట్టి అప్పరావు వైద్యపరీక్షల నిమిత్తం ఈ నెల 19వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలిసి

మఠంపల్లి, ఆగస్టు 24: మండలంలోని మట్టపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రామిశెట్టి అప్పరావు వైద్యపరీక్షల నిమిత్తం ఈ నెల 19వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. మట్టపల్లిలోని అప్పరావు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం, రెండు జతల పట్టీలు, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. కొన్ని పత్రాలు, కారు, బైక్ తళాలను తీసుకెళ్లారు. స్థానికులు, కుటుం బసభ్యులు అప్ప రావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంట్లో పరిశీలించగా సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు అప్పరావు తెలి పారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి ఆధారాలు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.