డిపాజిట్లపై అధిక వడ్డీ

ABN , First Publish Date - 2021-11-02T06:56:58+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సహకార బ్యాం కుల్లో డిపాజిట్‌ చేస్తే అధి క వడ్డీ పొందవచ్చని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపా రు.

డిపాజిట్లపై అధిక వడ్డీ
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి 


నల్లగొండ, నవంబ రు 1: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సహకార బ్యాం కుల్లో డిపాజిట్‌ చేస్తే అధి  క వడ్డీ పొందవచ్చని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపా రు. డిపాజిట్ల సేకరణ మహోత్సవాన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సహకార సంరక్షక పథకం కింద 400 రోజులకు 6.70శాతం వడ్డీ, సహకార మిత్ర కింద 800 రోజులకు 7శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. డిపాజిట్ల సేకరణ మహోత్సవం ఈ నెల 1వ తేదీ నుంచి  30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదివేందుకు రూ.25లక్షల వరకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణం కోసం రూ.30లక్షల వర కు రుణం ఇస్తున్నామన్నారు. భూములపై మార్ట్‌గేజ్‌ రుణాలు ఇస్తున్నామన్నారు. కరెంటు ఖాతాదారులకు స్వైపింగ్‌ మిషన్‌ సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బ్యాంకు నుంచి దీర్ఘకాలిక రుణాలైన ట్రాక్టర్‌, బైక్‌, వరికోత యంత్రాలు, కోళ్ల పెంపకంపై రుణాలు, డెయిరీ ఫామ్‌, పట్టుపురుగుల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, సీఈవో మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:56:58+05:30 IST