జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2021-07-08T06:54:58+05:30 IST

జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మూడు రోజుల నుంచి ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమితో తల్లడిల్లుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన వర్షం రాత్రి ఎనిమిది గంటల వరకు కురిసింది.

జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం

అనంతగిరి మండలంలో అత్యధికంగా 19.5మి.మీ వర్షపాతం నమోదు


సూర్యాపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మూడు రోజుల నుంచి ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమితో తల్లడిల్లుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన వర్షం రాత్రి ఎనిమిది గంటల వరకు కురిసింది. ఈ వర్షంతో పంటలకు ఊపిరి పోసినట్లయిందని రైతులు తెలిపారు. జిల్లాలో పత్తి, వేరుశనగ, కంది, పెసర పంటలు సాగు చేశా రు. వర్షం పంటలకు మేలు చేస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నారు. జిల్లాలో అనంతగిరి మండలంలో అత్యధికంగా 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సూర్యాపేటలో 15.5, కోదాడలో 8.5,పెన్‌పహాడ్‌లో 4.5, నడిగూడెంలో 3.0, చివ్వెంలలో 2.0, చిలుకూరులో 0.8, చింతలపాలెంలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపే ట జిల్లా కేంద్రంతో పాటు నడిగూడెం, సూర్యాపేట, చివ్వెంల మండలాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో పిడుగుపడింది. 

Updated Date - 2021-07-08T06:54:58+05:30 IST