డీడీఎన్‌ అర్చకులందరికీ హెల్త్‌కార్డులు జారీచేయాలి

ABN , First Publish Date - 2021-02-07T05:04:15+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే డీడీఎన్‌ అర్చకులందరికి హెల్త్‌ కార్డులు జారీ చేయాలని తెలంగాణ అర్చ క సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీడీఎన్‌ అర్చకులందరికీ హెల్త్‌కార్డులు జారీచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉపేంద్రశర్మ

నల్లగొండ కల్చరల్‌, ఫిబ్రవరి 6 : రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే డీడీఎన్‌ అర్చకులందరికి హెల్త్‌ కార్డులు జారీ చేయాలని తెలంగాణ అర్చ క సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని అర్చక సమాఖ్య భవనంలో శనివారం నిర్వహించిన డీడీఎన్‌ అర్చక సమాఖ్య రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న 3వేల మంది అర్చకులకు జీతాలు అందిస్తున్నారని, ఇంకా మిగిలిన 2650మంది అర్చకులకు జీతాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అర్చకుల జీవన పరిస్థితులను అధ్యయనం చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించి జీతభత్యా లు చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన అర్చకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్‌శర్మ మాట్లాడుతూ డీడీఎన్‌ అ ర్చకులకు జీతాలు అలస్యం గాకుండా ప్రతినెలా వచ్చేలా చూడాలని కోరా రు. అంతకుముందు సమాఖ్య నూతన సంవత్సర డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన్‌ చక్రవర్తుల వే ణుగోపాలాచార్యులు, రాష్ట్ర కార్యదర్శి వలివేటి వీరబ్రహ్మశర్మ, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణాచార్యులు, జిల్లా అధ్యక్షు డు శ్రవణ్‌కుమారాచార్యులు, నారాయణస్వామి, వెంకటరమణాచార్యులు, పలు రాష్ట్రాల సమాఖ్యల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
డీడీఎన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పెన్నా మోహన్‌శర్మ
 దూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా మోహన్‌శర్మ తిరిగి మూడోసారి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన డీడీఎన్‌ అర్చక సమాఖ్య రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో మోహన్‌శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు.

Updated Date - 2021-02-07T05:04:15+05:30 IST