విద్యార్థులు ఇష్టపడి చదవాలి

ABN , First Publish Date - 2021-12-31T16:04:04+05:30 IST

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.రమేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల.

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

మద్దిరాల, డిసెంబరు 30: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.రమేష్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థి గద్దె సత్యనారాయణ సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను గురువారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మురళీ, వెంకటేశ్వర్లు, ప్రియాంక, పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T16:04:04+05:30 IST