ఐఐటీ బాంబేలో సీటు సాధించిన హన్విత

ABN , First Publish Date - 2021-10-28T05:49:04+05:30 IST

నేరేడుచర్లకు చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి బాంబే ఐఐటీలో సీటు సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 361వ ర్యాంకు సాధించిన ఆమెకు మహిళా కేటగిరిలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు లభించింది.

ఐఐటీ బాంబేలో సీటు సాధించిన హన్విత
దొంతిరెడ్డి హన్వితారెడ్డి

నేరేడుచర్ల, అక్టోబరు 27: నేరేడుచర్లకు చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి బాంబే ఐఐటీలో సీటు సాధించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 361వ ర్యాంకు సాధించిన ఆమెకు మహిళా  కేటగిరిలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు లభించింది. నేరేడుచర్ల శ్రీవాణి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ప్రాథమిక విద్య, నారాయణ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించింది. ఐఐటీబాంబేలో సీటు సాధించాలన్న తన లక్ష్యం నెరవేరిందని హన్వితారెడ్డి తెలిపింది. విద్యార్థినిని గ్రామస్థులు అభినందించారు. 

Updated Date - 2021-10-28T05:49:04+05:30 IST