చేనేత కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2021-07-08T07:00:26+05:30 IST

పట్టణంలోని పద్మశాలి చేనేత కార్మిక సంఘం నూతన కార్యవర్గానికి నిర్వహించనున్న ఎన్నికల షెడ్యూల్‌ను నాయకులు బుధవారం ప్రకటించారు.

చేనేత కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
చేనేత కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తున్న మహాజన సంఘం నాయకులు

భూదానపోచంపల్లి, జూలై 7 : పట్టణంలోని పద్మశాలి చేనేత కార్మిక సంఘం నూతన కార్యవర్గానికి నిర్వహించనున్న ఎన్నికల షెడ్యూల్‌ను నాయకులు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మహాజన సంఘం అధ్యక్షుడు భారత పు రుషోత్తం, ప్రధాన కార్యదర్శి బోగ రాములు మాట్లాడుతూ సంఘం కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానంతో పాటు 8మంది పురుష డైరెక్టర్లు, 2 మహిళా డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 19 నుండి నామినేషన్ల స్వీకరణ ఉదయం 10నుంచి మధ్యా హ్నం 1గంట వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందన్నారు. ఈనెల 30న ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. సంఘంలో సభ్యత్వం పొందిన కార్మికులు, సభ్యులు ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తమకు సహకరించాల్సి ందిగా వారు కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు భారత పురుషోత్తంతోపాటు ప్రతినిధులు సీత సత్యనారాయణ, బోగ రాములు, దుద్యాల పాపయ్య, జెల్ది నర్సింహ, కడవేరు ఎల్లప్ప, బుగ్గరాములు, రుద్ర నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-08T07:00:26+05:30 IST