బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమే...: గుత్తా సుఖేందర్‌

ABN , First Publish Date - 2021-06-27T17:14:23+05:30 IST

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమే...: గుత్తా సుఖేందర్‌

నల్లగొండ: తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేస్తున్నారని అప్పట్లోనే వ్యతిరేకించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదులకు గౌరవం ఇవ్వలేదన్నారు. జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకు పోవాలని దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ రాయలసీమ పథకంతో భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని అన్నారు. బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమే వాళ్ళతో ఏం కాదని తెలిపారు. విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి  ఉన్నదని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఉత్తర కుమారుడే అని... రేవంత్‌వి పగటి కలలే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అన్నారు. కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికే రేవంత్‌కు సమయం సరిపోదని గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-27T17:14:23+05:30 IST