గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-04T06:09:07+05:30 IST

నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్‌డివిజన్‌ ఫరిధిలోని గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ గోపాల్‌రావును సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు సస్పెన్షన్‌

నల్లగొండ క్రైం మార్చి 3: నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్‌డివిజన్‌ ఫరిధిలోని గుడిపల్లి  పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ గోపాల్‌రావును సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌  తెలిపారు. ఎస్‌ఐపై పలు అవినీతి ఆరోపణలు ఉండడం, భూ వివాదాల్లో ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పలు విషయాల్లో బాధితులను పట్టించు కోకపోవడంతో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారని ఎస్పీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-04T06:09:07+05:30 IST