చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-26T05:49:59+05:30 IST
చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన చేనేత కార్మిక సంఘం మండల ద్వితీయ మహసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూలుపై ఇస్తున్న 40 శాతం రాయితీ ప్రతినెలా చేనేత కార్మికునికి అందే విధంగా నిబంధనలు సడలించాలని కోరారు. చే

ఆత్మకూరు(ఎం),డిసెంబరు 25: చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన చేనేత కార్మిక సంఘం మండల ద్వితీయ మహసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూలుపై ఇస్తున్న 40 శాతం రాయితీ ప్రతినెలా చేనేత కార్మికునికి అందే విధంగా నిబంధనలు సడలించాలని కోరారు. చేనేత కార్మికునికి పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.24వేలు ఇవ్వాలని, కార్మికులకు పని కల్పిస్తున్న చేనేత సహార సంఘాల క్యాష్ క్రెడిట్‌ను మాఫీ చేసి వాటిస్థానంలో కార్పస్ ఫండ్ ఇవ్వాలని, చేనేత కార్మికులకు పద్మశాలి బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు జెల్ది రాములు, పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి సుల్తాన్ పురుషోత్తం, మండల అధ్యక్షుడు నోముల యాదగిరి, ఏలూరు సుదర్శన్, వై.శ్రీనివాస్ పాల్గొన్నారు.