చేపల కోసం గుంపులు

ABN , First Publish Date - 2021-05-18T06:52:19+05:30 IST

మునుగోడు మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ పెద్దచెరువులో నిర్వాహకులు కొద్దిరోజులుగా చేపల వేట సాగిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

చేపల కోసం గుంపులు
కిష్టాపురం పెద్దచెరువు వద్ద జనం గుంపులుగా ఉన్న దృశ్యం

మునుగోడు :  మునుగోడు మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ పెద్దచెరువులో నిర్వాహకులు కొద్దిరోజులుగా చేపల వేట సాగిస్తుండటంతో పరిసర గ్రామాల  ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇలా వస్తున్న జనం గుంపులు గుంపులుగా చేరడంతో రద్దీ నెలకొంటోంది. ఆ సమయంలో కరోనా నిబంధనలు  గాలికి వదిలేస్తూ చేపల కోసం ఒక్కసారిగా ఎగబడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-18T06:52:19+05:30 IST