గ్రీవెన్స్‌ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు

ABN , First Publish Date - 2021-11-23T06:15:13+05:30 IST

గ్రీవెన్స్‌ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ప్రజలకు పోలీ్‌సశాఖ మరింత చేరువ కావడమే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ అన్నారు.

గ్రీవెన్స్‌ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు
గ్రీవెన్స్‌డేలో బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ రంగనాథ్‌

ఎస్పీ ఏవీ.రంగనాథ్‌


నల్లగొండ క్రైం, నవంబరు 22: గ్రీవెన్స్‌ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ప్రజలకు పోలీ్‌సశాఖ మరింత చేరువ కావడమే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితుల ఫిర్యాదులను స్వీకరించి వేగంగా స్పందించి పరిష్కరిస్తున్నామన్నారు. అందుకు జిల్లా పోలీ్‌స కార్యాలయంలో ప్రత్యేక విభాగం పనిచేస్తోందన్నారు.

Updated Date - 2021-11-23T06:15:13+05:30 IST