క్షేత్రపాలకుడికి ఆకుపూజ
ABN , First Publish Date - 2021-08-25T06:53:10+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, లక్ష్మీనృసింహుడికి విశేష పూజలు మంగళవారం కొనసాగాయి. కొండపైన విష్ణు పుష్కరిణి చెంత కొలువుదీరిన ఆంజనేయస్వామిని అభిషేకించిన అర్చకులు సింధూరం వివిధ రకాల పూలమాలలతో అలంకరించి నాగవల్లీ దళార్చనలు నిర్వ హించారు.

యాదాద్రి టౌన్, ఆగస్టు 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, లక్ష్మీనృసింహుడికి విశేష పూజలు మంగళవారం కొనసాగాయి. కొండపైన విష్ణు పుష్కరిణి చెంత కొలువుదీరిన ఆంజనేయస్వామిని అభిషేకించిన అర్చకులు సింధూరం వివిధ రకాల పూలమాలలతో అలంకరించి నాగవల్లీ దళార్చనలు నిర్వ హించారు. వడపప్పు, బెల్లం పానకం, అరటిపండ్లను స్వామి వారికి నివే దించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ క్షేత్రపాలకుడికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభువు లను ఆస్థానపరంగా అరాధించిన అర్చకులు బాలాలయంలో ఉత్సవ మూర్తులను అభిషేకించి, అర్చించారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. స్వామికి మంగళవారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.19.10 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్ధాన అధికారులు తెలిపారు.
స్వామి సేవలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్మన్ జె.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, బాలాలయ కవచమూర్తులను దర్శించుకుని సువర్ణపుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు.
ఆకర్షణగా ప్రధానాలయ ఆవరణ..
యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా కొండంతా పచ్చదనంతో పరిఢవిల్లే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొండచుట్టూ, కొండపైన ఆలయ పరిసరాల ప్రాంతాలను హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా కృష్ణరాతి శిలలతో పునర్ని ర్మాణం అవుతున్న ప్రధానాలయం చుట్టూ పుదుచ్చేరి కుండలు ఏర్పాటు చేయనున్నారు. గండి చెరువు ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గండి చెరువు చుట్టూ, రింగురోడ్డు రహదారిలో పచ్చదనాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటుతున్నారు.