ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్స్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-11-21T06:48:56+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు కమ్మంపాటి శంకర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు  గ్రాంట్స్‌ విడుదల చేయాలి


  ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు కమ్మంపాటి శంకర్‌ 

నల్లగొండ క్రైం, నవంబరు 20 : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు కమ్మంపాటి శంకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయాన్ని సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 20వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని, భర్తీ అయ్యేంత వరకు విద్యా వలంటీర్లను పునరుద్ధరించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు, పారిశుధ్య కార్మికులను నియమించాలని, మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించి పౌష్ఠికాహారాన్ని అందించి బిల్లులు విడుదల చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయల కల్పనకు రూ.10లక్షలు గ్రాంట్స్‌ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంజీఓ పోస్టులను నియమించాలని అన్నారు. కేజీబీవీ పాశాలలకు బడ్జెట్‌ విడుదల చేయాలని, మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే వర్క్‌బుక్స్‌, పెన్నులు, చెప్పులు, బ్యాగ్‌లు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను అందజేయాలని, తరగతి గదికి ఒక టీచర్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్‌, సహాయ కార్యదర్శి సుకుమార్‌, యువరాజ్‌, మనోహర్‌, మనోజ్‌, సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T06:48:56+05:30 IST