ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: సీపీఎం

ABN , First Publish Date - 2021-10-28T05:47:52+05:30 IST

వానాకాలం సీజన్‌ వరి కోతలు ప్రారంభమైనందున గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: సీపీఎం
సీపీఎం సమావేశంలో మాట్లాడుతున్న వీరారెడ్డి

నిడమనూరు, అక్టోబరు 27: వానాకాలం సీజన్‌ వరి కోతలు ప్రారంభమైనందున గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన నిడమనూరు, త్రిపురారం రెండు మండలాల పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు రైతు సమస్యలను విస్మరిస్తున్నాయని, ధాన్యాన్ని కొనుగోలు చేయని స్థితి నుంచి వరి పండిస్తే శిక్షిస్తామనే విధంగా ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఊతమిచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వం అవలింభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండలాల కార్యదర్శులు కందుకూరి కోటేష్‌, దైద శ్రీను, సీనియర్‌ నాయకుడు కత్తి లింగారెడ్డి, ఆకారపు నరేష్‌, ఇద్దయ్య, కోదండ చరణ్‌రాజ్‌, సామంత్‌, చంద్రశేఖర్‌, రాములు, లింగమ్మ, వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:47:52+05:30 IST