ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
ABN , First Publish Date - 2021-10-29T06:31:07+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

మాడ్గులపల్లి/ చిట్యాల రూరల్, అక్టోబరు 28: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడడంతోపాటు ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, పాదూరి శశిధర్‌రెడ్డి, వెంకన్న, నాగయ్య పాల్గొన్నారు. చిట్యాలలో పీఏసీఎస్ కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని సీపీఎం ఆధ్వర్యంలో మండ గుండ్రాంపల్లిలో డీసీసీబీ వైస్‌చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఽకార్యక్రమంలో కత్తుల లింగస్వామి, కత్తుల యాదయ్య, కూరాకుల అంజయ్య, గడకారి చంద్రయ్య, బీమిడి చంద్రారెడ్డి, కంకల ఐలయ్య, శంకరయ్య పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాతాకుల అంజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బందారపు శివ, ఉపాధ్యక్షుడు లింగాల యాదయ పాల్గొన్నారు.