ధాన్యం ఎగుమతులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-05-05T06:50:12+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం బస్తాల ఎగుమతులు వేగవంతం చేయాలని నాన్‌ఫారం ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ ఆదేశించారు.

ధాన్యం ఎగుమతులు వేగవంతం చేయాలి
చెర్వుఅన్నారంలో రైతులతో మాట్లాడుతున్న నాన్‌ఫాం డైరెక్టర్‌ ప్రవీణ

కట్టంగూర్‌, మే 4: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం బస్తాల ఎగుమతులు వేగవంతం చేయాలని నాన్‌ఫారం ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ ఆదేశించారు. మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, లారీల కొరత లే కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాన్‌ఫాం డీపీఎం శ్రవణ్‌కుమార్‌, ఏపీడీ సరస్వతి, డీపీఎంలు అరుణ, మోహన్‌రెడ్డి, ఏపీఎం లు చెవుగోని వినోద, చంద్రశేఖర్‌, సీసీలు వెంకన్న, శంకర్‌, మట్టయ్య ఉన్నారు.


Updated Date - 2021-05-05T06:50:12+05:30 IST