రైతుల మద్దతు కోల్పోయిన ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2021-01-12T05:36:17+05:30 IST

రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మద్దతు కోల్పోయాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రైతుల మద్దతు కోల్పోయిన ప్రభుత్వాలు
సూర్యాపేటలో కాంగ్రెస్‌ ర్యాలీలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, జనవరి 11 : రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మద్దతు కోల్పోయాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎ్‌స-బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా చట్టాలను తీసుకురావడం విచారకరమన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు రహస్య ఒప్పందంతో నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు వస్తున్నారన్నారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాలను ప్రారంభిస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో యాదృచ్ఛికంగా బీజేపీ గెలిచిందన్నారు. సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలుపుఖాయమని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అనంతరం పార్టీ నాయకులు కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, బీల్యానాయక్‌, తండు శ్రీనివా్‌సయాదవ్‌, చకిలం రాజేశ్వర్‌రావు, నాగన్న, గుడిపాటి నర్సయ్య, అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, సత్యం, బుచ్చిబాబు, నరేష్‌, తూముల సురే్‌షరావు, లక్ష్మినారాయణరెడ్డి, బైరు శైలేందర్‌గౌడ్‌, వంగవీటి రామారావు, గోపాల్‌నాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T05:36:17+05:30 IST