ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2021-01-21T05:17:41+05:30 IST
సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళా,శిశు సం క్షేమ శాఖ చైర్మన్ చింతారెడ్డి చంద్రకళ కోరారు.

సూర్యాపేట(కలెక్టరేట్), జనవరి 20: సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళా,శిశు సం క్షేమ శాఖ చైర్మన్ చింతారెడ్డి చంద్రకళ కోరారు. జడ్పీ కార్యా లయంలో బుధవారం జరిగిన ఐదో స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే పలు ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిప్యూటీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
చిలుకూరు: అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని, జడ్పీసీఈవో విజయలక్ష్మి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ రికార్డులను పరిశీలించారు. సమావేశంలో డీఎల్‌పీవో శ్రీరాములు, ఎంపీడీవో ఈదయ్య, ఎంపీవో యర్రయ్య, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.