గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-02-02T05:17:28+05:30 IST

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

మునగాల, ఫిబ్రవరి 1 : గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ప్రజల కోసం-ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఈదులవాగు తండా, నేలమర్రి, వెంకట్రాంపురం, తాడువాయి, మాధవరం గ్రామాల్లో సోమవారం పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లపాటి ప్రమీలాశ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ బుచ్చి పాపయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తొగరి రమేష్‌, సుంకర అజయ్‌కుమార్‌, నల్లపాటి శ్రీనివాసరావు, కందిబండ సత్యనారాయణ, సీతారాములు, సంజయ్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-02T05:17:28+05:30 IST