ప్రభుత్వం అన్నివర్గాలకు బంధువు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-27T05:56:36+05:30 IST

ప్రతి పేద కుటుంబాన్నీ ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, దళితబంధు పథకం ఆరంభమేనని అన్ని వర్గాలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. నడిగూడెంలో గురువారం జరిగిన దళితబంధు పథకం ఆత్మీయస భలో మాట్లాడారు. పార్టీలకతీతంగా పింఛన్లు, డబుల్‌

ప్రభుత్వం అన్నివర్గాలకు బంధువు : ఎమ్మెల్యే
నడిగూడెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

నడిగూడెం/ కోదాడ టౌన్‌, ఆగస్టు 26: ప్రతి పేద కుటుంబాన్నీ ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, దళితబంధు పథకం ఆరంభమేనని అన్ని వర్గాలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. నడిగూడెంలో గురువారం జరిగిన దళితబంధు పథకం ఆత్మీయస భలో మాట్లాడారు. పార్టీలకతీతంగా పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూఇళ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సాగర్‌ ఆయకట్టుతో పాటు నాన్‌ ఆయకట్టు గ్రా మాలను అభివృధ్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతా కుల జ్యోతిమధుబాబు, జడ్పీటీసీ బానాల కవిత నాగరాజు, సర్పం చ్‌ గడ్డం నాగలక్ష్మీమల్లేష్‌యాదవ్‌, యాతా కుల వీరస్వామి, నా గేశ్వరావు, గుజ్జఅనసూరమ్మ, స్వరూప వెంకన్న, సునీత వెంకటే శ్వర్లు పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో రజక, నాయీబ్రాహ్మణులకు 250యూనిట్ల ఉచిత విద్యు త్‌ పథకంలో భాగంగా ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ విద్యుత్‌ మీటర్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. కార్యక్రమంలో బుర్ర సుధారాణిపుల్లారెడ్డి, ఎంపీపీ కవితారెడ్డి, సైదయ్య, శ్రీనివాసులు, రవికుమార్‌, సైద, సత్యనారాయణ, స్టాలిన్‌, లెనిన్‌, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T05:56:36+05:30 IST