ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2021-02-01T05:48:10+05:30 IST

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
హుజూర్‌నగర్‌లో సీసీరోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌ రూరల్‌, జనవరి 31: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని 26, 27వ వార్డుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గెల్లి అర్చన రవి, జక్కల నాగేశ్వరరావు, శంభయ్య, నాగేశ్వరరావు, భాస్కర్‌, సతీష్‌, మంజుల, హరిబాబు, ఫణి, ఉపేంద్ర, సైదులు, రాంగోపి, అమర్‌నాథ్‌రెడ్డి, అమర్‌, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే బొల్లం

కోదాడ, జనవరి 31: సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. 27వ వార్డులో ఆదివారం పర్యటించారు. వార్డులో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు, అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ వనపర్తి శీరిషలక్ష్మీనారాయణ, కమిషనర్‌ మల్లారెడ్డి, కౌన్సిలర్‌ షాబుద్థీన్‌, నయిం, నాగేశ్వరరావు, అల్తాఫ్‌హుసేన్‌, నిర్మల, యాదగిరి పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-01T05:48:10+05:30 IST