బాలల పరిరక్షణకు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-12-26T06:12:39+05:30 IST

బాలల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చే స్తుందని అదనపు కలెక్టర్‌ వి. చంద్రశేఖర్‌ తెలిపారు.

బాలల పరిరక్షణకు ప్రభుత్వం కృషి
బాలరక్షక్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

 అదనపు కలెక్టర్‌ వి. చంద్రశేఖర్‌ 

నల్లగొండ టౌన, డిసెంబరు 25: బాలల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చే స్తుందని అదనపు కలెక్టర్‌ వి. చంద్రశేఖర్‌ తెలిపారు. బాలల సహాయం కోసం ప్ర భుత్వం ఏర్పాటు చేసిన అత్యవసర బాలరక్షక్‌ వాహనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆపద సమయంలో ఉన్న, రక్షణ అవసరమైన బాలలకు రక్షణ క ల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లాలో ప్రారంభించిన బాల రక్షక్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 18 ఏళ్లలోపు బాల, బాలికలు ఆపదలో ఉన్నట్లు గుర్తిస్తే టోల్‌ ఫ్రీ నెంబరు 1098కి సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ వాహనం ద్వారా ఇబ్బందుల్లో ఉన్న బాలలను తీసుకెళ్లి వారికి తగిన సంరక్షణ కల్పించను న్నట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా బాలల కో సం ఈ బాలరక్షక్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్య క్ర మంలో సంక్షేమ అధికారి సి. సుభద్ర, బాలల సంక్షేమ సమితి చైర్మన చింత కృష్ణ, సభ్యులు లక్ష్మీకిరణ్‌, డీసీపీవో కాసాని గణేష్‌, సిబ్బంది విద్య, రేవతి, రాము, మహేష్‌, ఎల్లేశ్వర్‌, చైల్డ్‌లైన సిబ్బంది ప్రవీణ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-26T06:12:39+05:30 IST