విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-09-02T07:13:00+05:30 IST

విద్యార్థుల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం కావడంతో మండలంలోని రేపూరు ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను, మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.

విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
మేళ్లచెర్వు మండలం రేవూరులో పాఠశాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

 అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

మేళ్లచెర్వు, సెప్టెంబరు 1 : విద్యార్థుల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం కావడంతో మండలంలోని రేపూరు ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను, మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిధుల సహకారంతో ఉపాధ్యాయులు మెరుగైన సౌకర్యలు కల్పించాలన్నారు. ప్రతి రోజూ తరగతి గదులను శుభ్రం చేయించి, తాగు నీరు,  విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ  పద్మాసైదేశ్వర్‌రావు స్వయంగా వడ్డించారు. 

గరిడేపల్లి : చిన్నారులను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కంటికి రెప్పలా కాపాడాలని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.మండల కేంద్ర ంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు ఎంపీపీ శానిటైజర్‌ వేసి తరగతి గదుల్లోకి పంపించారు. మండలంలోని గానుగుబండ, కల్మలచెర్వు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను సర్పంచ్‌లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కడియం స్వప్న వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ త్రిపురం సీతారామిరెడ్డి పాల్గొన్నారు.

 నేరేడుచర్ల :  మండలంలోని ఏడు ఉన్నత, 29 ప్రాథమిక పాఠశాలల్లో 2,439 విద్యార్థులుండగా, 716 మంది హాజరైనట్లు ఎంఈవో ఛత్రునాయక్‌ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ 20 శాతం మంది మాత్రమే హాజరైనట్లు ఆయన తెలిపారు. 

తిరుమలగిరి : మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2,748 విద్యార్థులకు  683 మంది మాత్రమే హాజరయ్యారు. కేఆర్‌కే తండాలో పుస్తకాలను సర్పంచ్‌ శ్రీనివాస్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. 

మోతె: మండలంలో విద్యార్థులకు మాస్కులను  సర్పంచ్‌ పొనుగోటి నర్సింహారావు అందజేశారు. 

హుజూర్‌నగర్‌ : మండలంలోని అమరవరం, శ్రీనివాసపురం గ్రామా ల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో  మధ్యాహ్నా భోజనాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు సుజాత, రమ్య ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

మఠంపల్లి : మండలంలోని భీల్యానాయక్‌తండాలో అంగన్‌వాడీ కేంద్రం, జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాలను జడ్పీటీసీ బానోతుజగన్‌నాయక్‌  పరిశీలించారు. కరోనా నిబంధనలను చిన్నారులు, విద్యార్థులు పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.   

అనంతగిరి: ఇంటిని మరిపించేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు  ఆటలు, విద్యాబుద్ధులు నేర్పించాలని  వైస్‌ఎంపీపీ ధరావత్‌ రామ అన్నారు. బొజ్జగూడెం తండాలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.  మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.  కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ హరినద్‌, కార్యదర్శి త్రివేణి, అంగన్‌వాడీ టీచరు భువనేశ్వరి, గ్రామస్థులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T07:13:00+05:30 IST