సాగు, తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-20T06:52:49+05:30 IST

దేవరకొండ నియోజకవర్గంలోని గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లు పూర్తిచేసి లక్ష 60వేల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరిన్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

సాగు, తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
దేవరకొండలో పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, అక్టోబరు 19:  దేవరకొండ నియోజకవర్గంలోని గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లు పూర్తిచేసి లక్ష 60వేల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరిన్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కిష్టరాయన్‌పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 మంది టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. వారికి పార్టీ కండువాలు కప్పి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని అన్నారు. సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, చింతపల్లి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు ధన్‌రెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ మండలపార్టీ అధ్యక్షుడు నట్వ గిరిధర్‌, సాగర్‌రావు, రవి, శ్రీశైలంగౌడ్‌, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:52:49+05:30 IST