అందరి భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు

ABN , First Publish Date - 2021-07-08T05:50:44+05:30 IST

అందరి భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు.

అందరి భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు
కోదాడ మండలం కాపుగల్లులో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ రూరల్‌, జూలై 7 : అందరి భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండ లంలోని కాపుగల్లులో ఎంపీపీ కవితారాధారెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, నాయకులు గంట శ్రీనివాసరావు, సైదులు, మస్తాన్‌, అప్పారావు, అధికారులు, పాల్గొన్నారు. అదేవిధంగా బీక్యాతండాలో పల్లె ప్రగతి పనులను ఎంపీపీ కవితారాధారెడ్డి పర్యవేక్షించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీచేశారు. ఆమె వెంట సర్పంచ్‌  అంబేడ్కర్‌, రామకృష్ణారెడ్డి ఉన్నారు.

అనంతగిరి: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. మండలంలోని త్రిపురవరం, కొత్తగోల్‌తండా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వేంకటేశ్వర్‌రావు, డీఎల్పీవో శ్రీరాములు, జడ్పీటీసీ ఉమ, ఎంపీడీవో శ్రీనివా్‌సరావు, ఎంపీవో నాగేశ్వర్‌రావు, ఏఈ శ్రీనివా్‌సరావు, బాలరాజు, ఏఈ హర్ష, ఏపీవో శైలజ తదితరులు పాల్గొన్నారు. 

సూర్యాపేట రూరల్‌ : మండలంలోని రాజానాయక్‌తండా, లక్ష్మీతండా, రామన్నగూడెం గ్రామాల్లో ఆర్డీవో రాజేంద్రకుమార్‌ పర్యటించారు. అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, వైస్‌ఎంపీపీ శ్రీనివా్‌సనాయుడు, ఎంపీడీవో శ్రీనివా్‌సరావు, సర్పంచ్‌లు అశోక్‌, సూర్యనాయక్‌, మల్లయ్య, ఎంపీటీసీ శాంతాబాయి పాల్గొన్నారు.అదేవిధంగా కేటీఅన్నారం, జాటోతుతండా గ్రామాల్లో అభివృద్ధి పనులను విజిలెన్స్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచులు బైరెడ్డి అలివేలు, హేమలత, కార్యదర్శి విజయకుమారి పాల్గొన్నారు. 

తిరుమలగిరి రూరల్‌: మర్రికుంటతండ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, పెంట దిబ్బను తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమే్‌షచారి, సర్పంచ్‌ దేవానాయక్‌, కార్యదర్శి ఇర్ఫాన్‌, ప్రత్యేకఅధికారి అరవింద్‌ పాల్గొన్నారు. 

గరిడేపల్లి: మండల కేంద్రంలో ప్రతి ఇంటికి ఆరుమొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివా్‌సగౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవీందర్‌రెడ్డి, ఎంపీడీవో వనజ, సర్పంచ్‌ త్రిపురం సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్నావెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

మేళ్లచెర్వు : ఎర్రగట్టుతండా, కప్పలకుంటతండాల్లో పారిశుధ్య పనులు, పూడిక తీత పనులను ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు, మండల ప్రత్యేకాధికారి శ్రీధర్‌ పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో ఇస్సాక్‌ హుస్సేన్‌, ఎంపీవో వీరయ్య, ఏపీవో రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అనంతగిరి: మండలంలోని ఖానాపురం, వెంకట్రాంపురం గ్రామాల్లో ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

మఠంపల్లి: శిథిలావస్థలోని ప్రభుత్వ భవనాలను కూల్చివేయాలని డీఆర్‌డీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పెంటయ్య అన్నారు. పెదవీడు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఆయన వెంట ఎంపీడీవో మామిడి జానకిరాములు, ఎంపీవో నరేష్‌, సర్పంచ్‌ సయ్యద్‌ బీబీకుతూబ్‌, ఎంపీటీసీ వెంకటరెడ్డి, ఉపసర్పంచ్‌ వేమూల పిచ్చయ్య ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జడ్పీటీసీ బానోతు జగన్‌నాయక్‌ మొక్కలు నాటారు.  

పెన్‌పహాడ్‌: మండలంలోని ధర్మాపురం గ్రామంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎం పీవో ఆంజనేయులు, గ్రామ ప్రత్యేకాధికారి నకిరేకంటి రవి, ఏపీవో రవి, సర్పంచ్‌ నెమ్మాది నగేష్‌, కార్యదర్శి సతీష్‌ పాల్గొన్నారు. 

తిరుమలగిరి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనీరాజశేఖర్‌ అన్నారు. తిరుమలగిరిలోని పలు వార్డుల్లో ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ దండు శ్రీను, కౌన్సిలర్‌ కన్నెబోయిన రేణుక, మేనేజర్‌, రషీద్‌, ఖదీర్‌, రాములు, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-08T05:50:44+05:30 IST