ఇంటి నుంచి వెళ్లి.. నదిలో శవమై..

ABN , First Publish Date - 2021-10-29T06:03:53+05:30 IST

కొద్దిరోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు ఏపీలోని కృష్ణాజిల్లాలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని అమీనాబాద్‌ గ్రామానికి చెందిన రామినేని వేలాద్రి(70) కొద్దిరోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

ఇంటి నుంచి వెళ్లి.. నదిలో శవమై..

అనంతగిరి, అక్టోబరు 28 :  కొద్దిరోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన వృద్ధుడు ఏపీలోని కృష్ణాజిల్లాలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని అమీనాబాద్‌ గ్రామానికి చెందిన రామినేని వేలాద్రి(70) కొద్దిరోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి దేవాలయం వద్ద కృష్ణానదిలో గురువారం శవమై కనిపించాడు. స్థానికుల్లో ఒకరైన బంధువు వేలాద్రి మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు వేలాద్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. వేలాద్రి మృతిపై టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు రామినేని పూర్ణచందర్‌రావు సంతాపం తెలిపారు. Updated Date - 2021-10-29T06:03:53+05:30 IST