ఆత్మకూర్‌(ఎస్‌) మండలానికి చేరిన గోదావరి జలాలు

ABN , First Publish Date - 2021-12-30T06:31:24+05:30 IST

యాసంగిలో వరి సాగు చేయొద్దంటున్న ప్రభు త్వం చెబుతున్న మరోవైపు కాల్వల ద్వారా గోదావరి జలాలు విడుదల చేసింది. బుధవా రం తెల్లవారుజామున డీబీఎం 71మెయిన్‌ కాల్వ ద్వారా మండలంలోని దాస్‌తండా నుం చి కందగట్ల గ్రామానికి గోదావరి జ

ఆత్మకూర్‌(ఎస్‌) మండలానికి చేరిన గోదావరి జలాలు
గట్టికల్‌ వద్ద 22ఎల్‌ కాల్వలో ప్రవహిస్తున్న గోదావరి జలాలు

ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 29: యాసంగిలో వరి సాగు చేయొద్దంటున్న ప్రభు త్వం చెబుతున్న మరోవైపు కాల్వల ద్వారా గోదావరి జలాలు విడుదల చేసింది. బుధవా రం తెల్లవారుజామున డీబీఎం 71మెయిన్‌ కాల్వ ద్వారా మండలంలోని దాస్‌తండా నుం చి కందగట్ల గ్రామానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. ఎడమ కాల్వ 22-ఎల్‌ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు నీళ్లు చేరనున్నాయి. ఇప్పటికే రైతులు వరి సాగుకు నార్లు పోసి సాగుకు సిద్ధమయ్యారు. బీడు, మెట్ట భూముల్లో గోదావరి జలాల ద్వారా సాగు చేసేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి రైతులు రెండేళ్లుగా చదును చేశారు. ఈ ప్రాంతంలో ఒక్కసారి సాగుచేసిన వానాకాలం వరి పంటతోనే ధాన్యం విక్రయ సమయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాసంగి సీజన్‌లో ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతోంది. గోదావరి జలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైతులకు నీళ్లు వచ్చినట్లే వచ్చి ఉపయోగం లేకుండా పోతున్నాయి. వారి ఆశలు ఆడియాశలయ్యాయి. శ్రీరాంసాగర్‌జలాలు కావాల ని నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధిస్తే అందినట్లే అంది ఉపయోగం లేకుండా పోతున్నాయన్న ఆవేదన రైతుల్లో కనబడుతోంది.  

వారం విడిచి వారం నీటి సరఫరా

యాసంగి ఆరుతడి పంటల సాగు కోసం గోదావరి జ లాలు వారం విడిచి వారం సరఫరా చేయనున్నారు. ప్రతి డీబీఎం 69,70,71కాల్వల ద్వారా రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపా రు. ఆరుతడి పంటల కోసం ఒక్కో కాల్వకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-30T06:31:24+05:30 IST