జీవో 317ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-31T16:00:13+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317ను రద్దు చేయాలని పోలీస్ సిబ్బంది కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

సూర్యాపేటటౌన్, డిసెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317ను రద్దు చేయాలని పోలీస్ సిబ్బంది కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవో 317 ప్రకారం కేవలం సీనియార్టీ ఆధారంగా ప్రస్తుతం చేస్తున్న బదిలీలతో పోలీస్ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు ఇతర జిల్లాలకు బదిలీలు కావడంతో భార్య ఒకచోట, భర్త మరో చోట ఉండాల్సి వస్తుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 128మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారని, అందులో 40మంది మహిళా కానిస్టేబుళ్లే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికైనా బదిలీలను నిలిపివేయాలని వారు కోరారు.